ఇంగ్లండ్‌ను గెలిపించిన స్టెర్లింగ్‌

ABN , First Publish Date - 2021-06-14T09:48:30+05:30 IST

రహీమ్‌ స్టెర్లింగ్‌ ఏకైక గోల్‌తో యూరో కప్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది.

ఇంగ్లండ్‌ను గెలిపించిన స్టెర్లింగ్‌

యూరో కప్‌


లండన్‌: రహీమ్‌ స్టెర్లింగ్‌ ఏకైక గోల్‌తో యూరో కప్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. గ్రూప్‌-డిలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 1-0తో క్రొయేషియాను ఓడించింది. 57వ నిమిషంలో బంతిని అందుకొన్న స్టెర్లింగ్‌.. క్రొయేషియా గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని నెట్‌లోకి పంపాడు. ఈ ఆధిక్యాన్ని ఇంగ్లండ్‌ చివరి వరకు నిలబెట్టుకుంది. గ్రూప్‌-బిలో జరిగిన మ్యాచ్‌లో రొమేలు లుకాకు డబుల్‌తో అదరగొట్టడంతో బెల్జియం 3-0తో రష్యాను చిత్తు చేసింది. లుకాకు (10, 88వ) రెండు గోల్స్‌ చేయగా.. థామస్‌ మ్యూనియర్‌ (34వ) ఓ గోల్‌ సాధించాడు. శనివారం రాత్రి ఇదే గ్రూప్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫిన్లాండ్‌ 1-0తో డెన్మార్క్‌పై గెలిచింది. 

Updated Date - 2021-06-14T09:48:30+05:30 IST