Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుత్ వైరు తగిలి విద్యార్థి మృతి

 కృష్ణా: జిల్లాలోని నందిగామ మండలం అనాసాగరంలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థి దారం గోపి చరణ్ 11కేవీ విద్యుత్ వైరు తగిలి మరణించాడు. అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న టాయిలెట్ పైన ఉన్న వాటర్ ట్యాంక్ పైకి గోపి ఎక్కాడు. ఆ వాటర్ ట్యాంక్ పైన 11 కేవీ విద్యుత్ వైరు తగలడంతో విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హాస్పటల్‌కు తరలించే సమయంలోనే మృతి చెందాడు. వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికే వెళ్ళారని కొందరు, ట్యాంక్ నిండిదా లేదా చూడానికి వెళ్ళారని కొందరు చెప్తున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని వాటర్ ట్యాంక్ పైకి ఎందుకు ఎక్కించారు, విద్యార్థుల చేత పనులు చేయించడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement