మహిళపై అత్యాచారం కేసులో Sub judge దోషి

ABN , First Publish Date - 2021-10-22T18:21:58+05:30 IST

ఓ మహిళపై అత్యాచారం చేసి, మోసగించిన కేసులో సస్పెన్షన్‌కు గురైన సబ్ జడ్జి దోషిగా కోర్టు నిర్ధారించింది....

మహిళపై అత్యాచారం కేసులో Sub judge దోషి

జమ్మూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారణ

జమ్మూ: ఓ మహిళపై అత్యాచారం చేసి, మోసగించిన కేసులో సస్పెన్షన్‌కు గురైన సబ్ జడ్జి దోషిగా కోర్టు నిర్ధారించింది.ఈ మేర జమ్మూలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూ నగరంలో 2018వ సంవత్సరంలో న్యాయసహాయం కోరి వచ్చిన ఓ మహిళపై అప్పటి సబ్ జడ్జి రాకేశ్ కుమార్ అబ్రోల్ అత్యాచారం చేసి, మోసం చేశాడు. న్యాయసహాయం కోరి వచ్చిన మహిళను సబ్ జడ్జి రాకేశ్ కుమార్ ఇంటి పని మనిషిగా నియమించుకొని, 5వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పి అత్యాచారం చేసి మోసగించాడని ప్రాసిక్యూషన్ చెప్పింది.సబ్ జడ్జి మొదటి భార్యతో విడాకుల తర్వాత, పెళ్లి చేసుకుంటానని చెప్పి పనిమనిషిపై అత్యాచారం చేసి, ఆమెను కాదని మరో మహిళను వివాహమాడారని ప్రాసిక్యూషన్ నిరూపించింది. దీంతో మహిళపై అత్యాచారం కేసులో రాకేశ్ కుమార్ ను దోషిగా నిర్ధారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు, శనివారం శిక్షను ఖరారు చేయనుంది. 



Updated Date - 2021-10-22T18:21:58+05:30 IST