సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-06-03T21:54:58+05:30 IST

రాజమండ్రి: సుప్రీంకోర్టు తీర్పుపై భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు స్పందించారు.

సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

రాజమండ్రి: సుప్రీంకోర్టు తీర్పుపై భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు స్పందించారు. రంగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిరంకుశ విధానాన్ని విడనాడి రాజ్యాంగాన్ని, శాసనాలను గౌరవించి అనుసరించాలన్నారు. 151 సీట్లు కాదు.. 175 సీట్లు వచ్చినా రాజ్యాంగానికి, శాసనాలకు కట్టుబడి పని చేయాల్సిందేనని సుబ్బారావు పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారుల పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి న్యాయస్థానం ముందు అపహాస్యం పాలవుతున్నారన్నారు. ఇప్పటికే  హైకోర్టు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు వచ్చినా ఇంకా పరివర్తనలో మార్పు రాకపోవటం దురదృష్టకరమన్నారు. తప్పులు చేసిన అధికారులు న్యాయస్థానాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని.. అంతే కాకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడితే జైల్లో ఉండవల్సి వస్తుందని సుబ్బారావు తెలిపారు.

Updated Date - 2020-06-03T21:54:58+05:30 IST