5.5లక్షల టన్నుల గానుగ లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-03T04:53:40+05:30 IST

2020-2021 క్రషింగ్‌ సీజన్‌లో 2.25 లక్షల టన్నుల చెరుకు గానుగ ఆడనున్నట్లు మధుకాన్‌ షుగర్స్‌ ఎండి నామా కృష్ణయ్య చెప్పారు.

5.5లక్షల టన్నుల గానుగ లక్ష్యం
మధుకాన్‌లో చెరుకు క్రషింగ్‌ ప్రారంభిస్తున్న ఎండి నామా కృష్ణయ్య

మధుకాన్‌ షుగర్స్‌ ఎండి నామా కృష్ణయ్య

నేలకొండపల్లి, డిసెంబరు 2: 2020-2021 క్రషింగ్‌ సీజన్‌లో 2.25 లక్షల టన్నుల చెరుకు గానుగ ఆడనున్నట్లు మధుకాన్‌ షుగర్స్‌ ఎండి నామా కృష్ణయ్య చెప్పారు. 2020-2021 క్రషింగ్‌ను బుధవారం నామా కృష్ణయ్య చెరుకును కేన్‌ క్యారియర్‌లో వేసి ప్రారంభించారు. అనంతరం కృష్ణయ్య రెతులనుద్ధేశించి మాట్లాడుతూ రానున్న సీజన్‌లో అనగా 2021-2022 సీజన్‌లో 5.5 లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడటం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తుందన్నారు. చెరుకు నరకటానికి కూలీలను సైతం ఫ్యాక్టరీ సరఫరా చేస్తుందన్నారు. రైతులకు అనేక సబ్సిడీలను ఇస్తున్నామని, రైతు శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు పోతున్నామన్నారు. అదే సమయంలో రైతులు సైతం ఫ్యాక్టరీ యాజమాన్యానికి సహకరించాలని, ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో సామర్ధ్యం మేరకు చెరుకు క్రషింగ్‌ చేసేలా చెరుకును పండించాలని కోరారు. అంతకు ముందు డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ మందలపు శ్రీనివాసరావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీడీసీ ఛైర్మన్‌ జూకూరి గోపాలరావు, మాజీ చైర్మన్లు నెల్లూరి లీలాప్రసాద్‌, యాసా విష్ణువర్ధన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ సూరపనేని రామకృష్ణ, సీడీసీ డైరెక్టర్‌ చింతనిప్పు సైదులు, అమ్మగూడెం, రాజేశ్వరపురం సర్పంచ్‌లు గండు సతీష్‌, దండా పుల్లయ్య, ఎంపీటీసీ సభ్యురాలు జటంగి చంద్రమ్మ, రైతులు తలశీల గోపాలరావు, నలమాస మల్లయ్య, యలమద్ది వెంకటేశ్వరరావు, రచ్చా నర్సింహారావు, రాసాల కనకయ్య, బెల్లం పుల్లయ్య , కందిబండ వీరయ్యలతో పాటు ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T04:53:40+05:30 IST