సన్ డే ఫన్ డే పై ఒమైక్రాన్ ప్రభావం

ABN , First Publish Date - 2021-12-11T22:03:13+05:30 IST

ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది నగర వాసులు ఛలో టాంక్ బండ్ అంటున్న విషయం తెలిసిందే.

సన్ డే ఫన్ డే పై ఒమైక్రాన్ ప్రభావం

హైదరాబాద్‌: ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది నగర వాసులు ఛలో టాంక్ బండ్ అంటున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రతి ఆదివారం టాంక్ బండ్ పై సన్ డే ఫన్ డే, చార్మినార్ వద్ద ఏక్ శామ్ చార్మినార్ కే నామ్ పేరుతో పెద్దయెత్తున సందడి చేస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసి, హెచ్ఎండిఏ రెండు శాఖలు ప్రతి ఆదివారం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. అయితే దేశంలోకి ఒమైక్రాన్ ప్రవేశంతో అధికారులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 


ఈ నేపధ్యంలో వేలా సంఖ్యలో జనం ఒక చోట చేరే ఈ కార్యక్రమాలకు కొద్దిరోజుల పాటు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ అలజడి నేపథ్యంలో డిసెంబర్‌ 12న (ఆదివారం) ట్యాంక్‌బండ్‌ వద్ద సండే-ఫన్‌డే, పాతబస్తీలో ‘ఏక్‌ శాం-చార్మినార్‌ కే నామ్’ వినోద కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తెలిపారు. 


పరిస్థితులు కుదుటపడిన తర్వాత యథావిధిగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో గతకొన్ని రోజులుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే ఫండ్‌ కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతివారం ప్రత్యేక షోలు నిర్వహిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. ప్రతి ఆదివారంసాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఒమైక్రాన్ వ్యాప్తి సద్దుమణిగిన తర్వాత ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Updated Date - 2021-12-11T22:03:13+05:30 IST