Abn logo
Oct 16 2021 @ 18:02PM

ఆదివారం చార్మినార్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: ఈ నెల 17వ తేదీ ఆదివారం చార్మినార్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్ పోలీస్ అధికారులు తెలిపారు.టాంక్ బండ్ పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నట్టుగానే చార్మినార్ వద్ద కూడా ‘ ఏక్ షాం చార్మినార్ కె నామ్ ’ సన్ డే ఫన్ డే నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా ఆదివారం చార్మినార్ వద్ద నో ట్రాఫిక్, నో షాపింగ్, ఓన్లీ సెలబ్రేషన్స్ జరుగుతాయని అధికారులు తెలిపారు. చార్మినార్ వద్ద సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరిగే సెలెబ్రేషన్స్ కారణంగా నాలుగు ప్రదేశాల్లో సందర్శకుల కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఈ ఆదివారం ట్రయల్ రన్ తో ప్రతి ఆదివారాలు చార్మినార్ వద్ద సెలబ్రేషన్స్ కొనసాగించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. 

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...