ట్యాంక్‌బండ్‌పై ప్రారంభమైన సండే-ఫన్ డే కార్యక్రమం

ABN , First Publish Date - 2021-09-13T00:49:34+05:30 IST

ట్యాంక్‌బండ్‌పై సండే-ఫన్ డే కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు

ట్యాంక్‌బండ్‌పై ప్రారంభమైన సండే-ఫన్ డే కార్యక్రమం

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై సండే-ఫన్ డే కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్మీ బ్యాండ్ చూడడానికి టాంక్ బండ్‌పై సిటీ వాసులు భారీగా చేరుకున్నారు. ట్యాంక్‌బండ్ పైకి వాహనాలు రాకుండా దారి మళ్లించారు. నడుచుకుంటూ వచ్చేవారికే ట్యాంక్‌బండ్ పైకి అనుమతిచ్చారు. ట్యాంక్‌బండ్‌పై ఆర్మీ బ్యాండ్, లేజర్ షో ఏర్పాటు చేశారు. టెస్కో హాండ్లూమ్ స్టాల్, ఫుడ్ ట్రాక్‌ల ఏర్పాటు చేశారు. మొబైల్ టాయిలెట్స్, అంబులెన్స్‌లను హెచ్ఎండీఏ అందుబాటులో ఉంచింది.


Updated Date - 2021-09-13T00:49:34+05:30 IST