సునీత, శివనాథరెడ్డి సాకులు చెప్పి విచారణకు రావడంలేదు: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-06-03T22:52:43+05:30 IST

ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డి సాకులు చెప్పి విచారణకు రావడంలేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న తప్పుబట్టారు. సీఎం జగన్‌ను పోతుల సునీత కలిసిందని

సునీత, శివనాథరెడ్డి సాకులు చెప్పి విచారణకు రావడంలేదు: బుద్దా వెంకన్న

అమరావతి: ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డి సాకులు చెప్పి విచారణకు రావడంలేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న తప్పుబట్టారు. సీఎం జగన్‌ను పోతుల సునీత కలిసిందని, శివనాథరెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారని తెలిపారు. మండలి చైర్మన్‌ వద్ద హాజరైతే విప్‌ ధిక్కరించినట్లవుతుందని రావడంలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సిఫార్సు మేరకే గవర్నర్‌ కోటాలో శివనాథరెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 


వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినప్పుడు పోరాడకపోవడం జగన్‌ బలహీనతని, శివనాథరెడ్డి బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో కడప ప్రజలకు తెలుసని టీడీపీ నేత అశోక్‌బాబు చెప్పారు. పోతుల సునీత, శివనాథరెడ్డి ఇచ్చిన సంజాయిషీ పేపర్లు పరిశీలించి అడిషనల్‌ కౌంటర్‌ వేస్తామని అశోక్‌బాబు తెలిపారు. 


టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది. గత అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ విప్ ఉల్లంఘించారని ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డిపై చైర్మన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. మండలి టీడీపీ విప్ బుద్దా వెంకన్న అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి విచారణకు హాజరు కాలేదు.

Updated Date - 2020-06-03T22:52:43+05:30 IST