తొలి వికెట్ కోల్పోయిన రైజర్స్

ABN , First Publish Date - 2021-04-18T03:37:37+05:30 IST

పవర్ ప్లే వరకు అద్భుతంగా ఆడుతున్న సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్న జానీ బెయిర్‌స్టో(43: 22 బంతుల్లో.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లు).. హిట్ వికెట్‌గా వెనుతిరిగాడు. కృనాల్ పాండ్యా వేసిన...

తొలి వికెట్ కోల్పోయిన రైజర్స్

చెన్నై: పవర్ ప్లే వరకు అద్భుతంగా ఆడుతున్న సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్న జానీ బెయిర్‌స్టో(43: 22 బంతుల్లో.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లు).. హిట్ వికెట్‌గా వెనుతిరిగాడు. కృనాల్ పాండ్యా వేసిన 8వ ఓవర్లో థర్డ్ మ్యాచ్ దిశగా స్వీప్ ఆడే క్రమంలో క్రీజులో బాగా వెనక్కి వెళ్లిన బెయిర్ స్టో వికెట్లను తన్నేశాడు. దీంతో రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రైజర్స్ 7.2 ఓవర్లలో ఓ వికెట్‌కు 67 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(23: 22 బంతుల్లో.. 2 ఫోర్లు, 1 సిక్స్), మనీష్ పాండే(0) క్రీజులో ఉన్నారు. కాగా.. ముంబై జట్టు తన తొలి వికెట్‌ను రోహిత్ శర్మ(32: 25 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్సులు) 55 పరుగుల వద్ద కోల్పోయింది.

Updated Date - 2021-04-18T03:37:37+05:30 IST