80 శాతం వద్దంటున్నారు

ABN , First Publish Date - 2021-05-18T05:51:39+05:30 IST

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ఇంకా పది వారాల సమయం కూడా లేదు. కానీ ఈ గేమ్స్‌పై జపాన్‌లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. ఇటీవలే ఓ న్యాయవాది ఆధ్వర్యంలో ఈ గేమ్స్‌కు వ్యతిరేకంగా...

80 శాతం వద్దంటున్నారు

  • ఒలింపిక్స్‌పై సర్వే

టోక్యో: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ఇంకా పది వారాల సమయం కూడా లేదు. కానీ ఈ గేమ్స్‌పై జపాన్‌లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. ఇటీవలే ఓ న్యాయవాది ఆధ్వర్యంలో ఈ గేమ్స్‌కు వ్యతిరేకంగా 3 లక్షల 50 వేల ఆన్‌లైన్‌ సంతకాలతో కూడిన విన్నపాన్ని గేమ్స్‌ నిర్వాహకులకు అందించారు. తాజాగా నిర్వహించి న ఓ సర్వేలో ఏకంగా 80 శాతం మంది ప్రజలు ఈ గేమ్స్‌ను జరపొద్దంటూ తేల్చడం గమనార్హం. స్థానిక ఆషీ షింబున్‌ పత్రిక వీకెండ్‌ సర్వేలో 43 శాతం మంది ఒలింపిక్స్‌కును రద్దు చేయాలని చెప్పగా.. మరో 40 శాతం మంది వాయిదా వేయాలన్నారు. గత నెలలో ఇదే పత్రిక సర్వేలో 35 శాతం మంది మాత్రమే రద్దు చేయాలని కోరగా ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు అక్కడ కరోనా నాలుగో వేవ్‌ తీవ్రత కొనసాగుతుండగా మెడికల్‌ ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు.  


Updated Date - 2021-05-18T05:51:39+05:30 IST