Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్ 17 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-02T12:33:24+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్‌ ఫ్లో 1,19,941 క్యూసెక్కులు

Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్ 17 గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్‌ ఫ్లో 1,19,941 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,25,347 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు ఉండగా, ప్రస్తుతం 172.40 అడుగులుగా ఉంది. పులిచింతల పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 41.832 టీఎంసీలు ఉంది. విద్యుదుత్పత్తి కోసం 13,200 క్కూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాలుగు యూనిట్లలో 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-08-02T12:33:24+05:30 IST