అర్చకుల వేతనాలకు బడ్జెట్ కేటాయింపులపై స్వరూపానందేంద్ర స్పందన
ABN , First Publish Date - 2021-05-20T20:00:06+05:30 IST
విశాఖపట్నం: అర్చకుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయింపులపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్పందించారు.
విశాఖపట్నం: అర్చకుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయింపులపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్పందించారు. అర్చకుల వేతనాల కోసం రూ. 120 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాల గురించి పాలకులు పట్టించుకోలేదన్నారు. జీతాలను పెంచి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ అభినంద నీయుడన్నారు. రిషికేశ్‌లో ఉన్న తాము ఈ వార్త విని ఆనందించామన్నారు. జగన్మోహన్ రెడ్డికి రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.