Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్వీట్‌ పొటాటో నూడుల్స్‌

స్వీట్‌ పొటాటో హాట్‌గా..!

చిలగడదుంపలను  ఉడకబెట్టుకుని తింటాం. ఈ తీపి దుంపతో పలు రకాల  నోరూరించే రెసిపీలు తయారుచేసుకోవచ్చు. స్వీట్‌ పొటాటోతో నూడుల్స్‌, సూప్‌, పఫ్స్‌, చిలగడదుంప రైస్‌...ఇలా  రకరకాల వంటకాలను చేసుకోవచ్చు. ఈ వారం స్వీట్‌ పొటాటోతో టేస్టీ వెరైటీను తనివితీరా ఆస్వాదించండి.

కావలసినవి: చిలగడదుంపలు - అరకేజీ, ఉల్లిపాయలు - రెండు, నిమ్మకాయ - ఒకటి, పల్లి పట్టీలు - ఐదారు, పల్లీలు - కొద్దిగా, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా చిలగడదుంపలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి, స్పైరలైజర్‌తో నూడుల్స్‌ మాదిరిగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తరిగి పెట్టుకున్న చిలగడదుంపలు వేసి వేగించాలి. ఐదు నిమిషాల పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక పల్లి పట్టీలు వేసి వేగించి తీసుకోవాలి. పల్లి పట్టీలను వేగించి పెట్టుకున్న చిలగడదుంపలపై వేయాలి. పల్లీలు వేసి, నిమ్మరసం పిండి, కొత్తిమీర, ఉల్లిపాయలతో గార్నిస్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


పటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)
Advertisement

నవ్య మరిన్ని