Abn logo
Jul 24 2021 @ 23:50PM

పెచ్చులూడిన ఆస్పత్రి భవనం.. తప్పిన ప్రమాదం

ఆస్పత్రి ఆవరణలో ఊడిన పెచ్చులు

ఆమనగల్లు: ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి వర్షాలకు స్లాబ్‌ లీకేజీ అయి ఆవరణలోకి వర్షపు నీరు చేరింది. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం పై పెచ్చులూడి శనివారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. ఆసుపత్రి ఆవరణలో చాలా చోట్ల స్లాబ్‌ పెచ్చులూడి పడి చువ్వలు తేలాయి. వర్షం వస్తే తరుచు జలమయమే ఆవు తుందని రోగులు, స్థానికులు వాపోతున్నారు. పాత భవనం మూలంగా ప్రమాదం పొంచివుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. భవనానికి మరమ్మతులు  చేపట్టా లని స్థానికులు కోరుతున్నారు.