భారత మార్కెట్‌లోకి తైవాన్ కంపెనీ... త్వరలో పబ్లిక్ ఇష్యూకు...

ABN , First Publish Date - 2021-01-12T22:50:20+05:30 IST

తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీ కాంట్రాక్ట్ కంపెనీ ఫాక్స్‌కాన్... త్వరలో భారత మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. ఐ ఫోన్లను తయారు చేసే ఈ సంస్థకు ఇప్పటికే భారత్‌లో యూనిట్లున్నాయి.

భారత మార్కెట్‌లోకి తైవాన్ కంపెనీ... త్వరలో పబ్లిక్ ఇష్యూకు...

 ముంబై : తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీ కాంట్రాక్ట్ కంపెనీ ఫాక్స్‌కాన్... త్వరలో భారత మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. ఐ ఫోన్లను తయారు చేసే ఈ సంస్థకు ఇప్పటికే భారత్‌లో యూనిట్లున్నాయి. ఈ క్రమంలోనే... వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. తాజాగా. అదే స్థాయిలో నిధులను సేకరించడానికి సన్నాహాలు చేపట్టబోతోంది. ఈ క్రమంలో... పబ్లిక్ ఇష్యూను జారీ చేయబోతోంది. ఇందుకవసరమైన ప్రాథమిక చర్యలను తీసుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 


తైపీ ప్రధానకేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఫాక్స్‌కాన్ భారత స్టాక్ ఎక్స్‌ఛేంజీలో ఇప్పటిదాకా అడుగు పెట్టలేదు. కాగా... ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)ను జారీ చేయడ ద్వారా రూ. 5 వేల కోట్లను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఫాక్స్‌కాన్ సంస్థ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వద్ద బిలియన్ డాలర్ల వ్యయంతో యాపిల్ ఐఫోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతోంది. 


గతంలో... అంటే... 2018 లో ఫాక్స్‌కాన్ షాంఘై స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఎంట్రీ ఇచ్చింది. పబ్లిక్ ఇష్యూను జారీ చేసింది. అది విజయవంతం కావడంతో ఇక భారతీయ మార్కెట్‌పై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-01-12T22:50:20+05:30 IST