కరోనా చికిత్సకు డెక్సామెథసోన్‌ను అప్రూవ్ చేసిన తైవాన్

ABN , First Publish Date - 2020-08-04T23:37:42+05:30 IST

యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ కొరత తీవ్రంగా ఉండంతో కరోనా వైరస్ చికిత్సకు డెక్సామెథసోన్

కరోనా చికిత్సకు డెక్సామెథసోన్‌ను అప్రూవ్ చేసిన తైవాన్

తైపీ: యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ కొరత తీవ్రంగా ఉండంతో కరోనా వైరస్ చికిత్సకు డెక్సామెథసోన్ స్టెరాయిడ్‌ వాడకాన్ని తాత్కాలికంగా అనుమతిస్తున్నట్టు తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం ఇటీవల భారీగా రెమ్‌డెసివిర్‌ డ్రగ్ర్స్‌ను కొనుగోలు చేయడంతో అనేక దేశాల్లో దీని కొరత ఏర్పడింది. కరోనా బారిన పడ్డవారు రెమ్‌డెసివిర్‌తో త్వరగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో తెలిసింది. దీంతో ఈ డ్రగ్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిపోయింది. తైవాన్‌లో ప్రస్తుతం కేవలం 78 రెమ్‌డెసివిర్ మెడిసిన్స్ మాత్రమే ఉండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను వెతకసాగింది. డెక్సామెథసోన్ కరోనా పేషంట్ల ప్రాణాలను కాపాడుతోందని జూన్‌లో యూకేలోని పరిశోధకులు ప్రకటించారు. ఇక జపాన్ ప్రభుత్వం సైతం కరోనా చికిత్సకు డెక్సామెథసోన్‌ను వాడొచ్చని గత నెల అప్రూవ్ చేసింది. ఈ నేపథ్యంలో తైవాన్ ప్రభుత్వం డెక్సామెథసోన్‌ను వాడాలని నిర్ణయించుకుంది. కరోనా చికిత్సకు డెక్సామెథసోన్‌ను వాడొచ్చని మెడికల్ నిపుణులు అనుమతిచ్చారని.. అయితే పేషంట్లకు దీన్ని ఇచ్చే ముందు కొన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉందని తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చువాంగ్ మంగళవారం తెలిపారు.

Updated Date - 2020-08-04T23:37:42+05:30 IST