Abn logo

తందూరీ గోబి

కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్‌ - ఒకటి, పెరుగు- రెండు కప్పులు, అల్లంవెల్లుల్లి పేస్టు- అర స్పూను, కారం పొడి, పసుపు- అర స్పూను, ధనియాల పొడి - స్పూను, ఛాట్‌ మసాలా- స్పూను, శనగ పిండి- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత, కొత్తిమీర తురుము- పావు కప్పు.


తయారుచేసే విధానం: మొదట పెరుగులోని నీళ్లన్నీ ఇంకేలా చేయాలి. కాలీఫ్లవర్‌ పువ్వుల్ని కట్‌ చేసుకొని ఉప్పువేసిన నీళ్లలో మూడు నిమిషాలు ఉడికించి నీళ్లు వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో శనగ పిండి, కారం, మసాలాలు, ఉప్పు, పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమం లో గోబీ పువ్వుల్ని వేసి ఓ రెండు గంటలు మూత పెట్టాలి. ఓవెన్‌లో ఒక్కో గోబీ పువ్వును గ్రిల్‌ లేదా ట్రేలో బేక్‌ చేయాలి. అన్నీ అయ్యాక పైన కొత్తిమీర తురుము, ఛాట్‌ మసాలా చల్లితే సరి.

గోన్‌ అవాల్‌ యామ్‌ గలౌటీ అల్టా తవా పరోటాటోఫు మేదు వడమసాలా బ్రెడ్‌ ఉప్మాముల్లంగి, గోబి కూరరవ్వ వడవెజ్‌మొఘలాయి పరాఠానూడుల్స్‌ సమోసాలక్సారొయ్యల నూడుల్స్‌
Advertisement

నవ్య మరిన్ని