క్రికెటర్‌ కాకుంటే.. ఉగ్రవాది అయ్యేవాడు!

ABN , First Publish Date - 2021-04-07T09:54:55+05:30 IST

ఇంగ్లండ్‌ క్రికెటర్‌, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడైన మొయిన్‌ అలీపై బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను క్రికెటర్‌ కాకపోయుంటే.. కచ్చితంగా ఉగ్రవాది అయ్యుండేవాడని...

క్రికెటర్‌ కాకుంటే.. ఉగ్రవాది అయ్యేవాడు!

  • మొయిన్‌ అలీపై తస్లీమా వివాదాస్పద వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ క్రికెటర్‌, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడైన మొయిన్‌ అలీపై బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను క్రికెటర్‌ కాకపోయుంటే.. కచ్చితంగా ఉగ్రవాది అయ్యుండేవాడని ట్వీట్‌ చేశారు. ఐపీఎల్‌లో చెన్నై జట్టు జెర్సీపై మద్యం కంపెనీ లోగో ఉన్నందున.. దాని స్థానంలో మరో జెర్సీ ధరించేందుకు తనకు అనుమతివ్వాలని మొయిన్‌ అలీ సీఎ్‌సకే యాజమాన్యాన్ని కోరినట్టు రెండ్రోజుల క్రితం వార్తలొచ్చాయి. దీనిపైనే తస్లీమా స్పందిస్తూ.. ‘మొయిన్‌ అలీ క్రికెట్‌లో నిలవలేకుంటే.. కచ్చితంగా సిరియా వెళ్లి ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరేవాడు’ అని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. తస్లీమా ట్వీట్‌పై నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. జెర్సీపై లోగోను తొలగించాలంటూ మొయిన్‌ అలీ తమను కోరలేదని చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్‌ స్పష్టం చేశాడు.


Updated Date - 2021-04-07T09:54:55+05:30 IST