మూడో త్రైమాసికంలో టీసీఎస్ లాభం... రూ. 8,701 కోట్లు... రూ. 6 చొప్పున డివిడెండ్...

ABN , First Publish Date - 2021-01-10T23:20:43+05:30 IST

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మూడో త్రైమాసికం ఫలితాలు వెల్లడయ్యాయి. అంచనాలకు మించిన ఫలితాలతో అదరగొట్టింది టీసీఎస్. ఈ(2020-21) ఆర్థిక ఏడాదిలో మూడో త్రైమాసికంలో సగటు లాభం ఏడు శాతం ఎగసి రూ. 8,701 కోట్లుగా నమోదైంది.

మూడో త్రైమాసికంలో టీసీఎస్ లాభం... రూ. 8,701 కోట్లు... రూ. 6 చొప్పున డివిడెండ్...

ముంబై : ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మూడో త్రైమాసికం ఫలితాలు వెల్లడయ్యాయి. అంచనాలకు మించిన ఫలితాలతో అదరగొట్టింది టీసీఎస్. ఈ(2020-21) ఆర్థిక ఏడాదిలో మూడో త్రైమాసికంలో సగటు లాభం ఏడు శాతం ఎగసి రూ. 8,701 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 8,118 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా... ఒక్కో షేర్‌కు కంపెనీ రూ. 6 డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ ఆదాయం 5 శాతం పెరిగి రూ. 42,015 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.39,854 కోట్లుగా ఉంది. 


 డిసెంబరు త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 7.1 శాతం వృద్ధిని నమోదు చేసిన టీసీఎస్...  త్రైమాసికంపరంగా 16.4 శాతం వృద్ధిని సాధించింది. కరోనా నేపధ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొంత మేరకు క్షీణించింది. అయితే ఆ తర్వాత కంపెనీలు ఐటీ సేవల వైపు మొగ్గు చూపుతుండంతో డిమాండ్ పెరిగింది. ఎపిక్‌తో లిటిగేషన్ కారణంగా సెప్టెంబరు త్రైమాసికంలో పోస్ట్ ట్యాక్స్ వన్ టైమ్ ప్రభావం పడింది. ఇక, డిసెంబరు త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ రెవెన్యూ 4.7 శాతం పెరిగి రూ. 42,015 కోట్లుగా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన 5.4 శాతం ఎగసింది. విశ్లేషకుల అంచనాలకు మించి త్రైమాసికం ప్రాతిపదికన స్థిర కరెన్సీలో రెవెన్యూ గ్రోత్ 4.1 శాతం వృద్ధిని నమోదు చేసి, విశ్లేషకుల అంచనాలను మించింది. సాధారణంగా ఐటీ రంగానికి డిసెంబరు త్రమాసికం బలహీనంగా ఉంటుంది. వృద్ధి 2.8 శాతం నుండి 2.9 శాతం మధ్య ఉంటుందని అంచనా వేయగా, అంచనాలను మించింది. డాలర్ రెవెన్యూ గ్రోత్ 5702 మిలియన్ డాలర్లుగా నమోదయింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 5.1 శాతం వృద్ధి సాధించింది. అంచనాలు రూ. 5,600 కోట్లుగా ఉండగా, దీనిని మించింది. 

Updated Date - 2021-01-10T23:20:43+05:30 IST