నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

ABN , First Publish Date - 2022-03-03T14:10:36+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరుగనుంది.

నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా..? వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష చేయనున్నారు. పొలిట్ బ్యూరో భేటీలో ఎన్టీఆర్ శత జయంతి, పార్టీ ఆవిర్భావ వేడుకలు, సభ్యత్వ నమోదు నిర్వాహణ  ప్రస్తావనకు రానుంది. 


Updated Date - 2022-03-03T14:10:36+05:30 IST