విద్యుత్ మీటర్ల పేరుతో మోసం
ABN , First Publish Date - 2021-09-12T00:28:05+05:30 IST
రాష్ట్రంలో రైతు పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు పేరుతో రైతులను జగన్ ప్రభుత్వం
అమరావతి: రాష్ట్రంలో రైతు పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు పేరుతో రైతులను జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు. రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలకు కరెంట్ బిల్లుల షాక్ తగులనుందని మంత్రి ఆలపాటి అన్నారు. ఎస్సీ కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారం పడనుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ మీటర్ల విధానాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తే మన ప్రభుత్వం మాత్రం మద్దతు పలకడం దుర్మార్గమని ఆలపాటి రాజా ఆరోపించారు.