Advertisement
Advertisement
Abn logo
Advertisement

వినుకొండ రైతును వెంటనే విడుదల చేయాలి: Chandrababu

అమరావతి: వినుకొండ రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని రైతులోకం క్షమించదని అన్నారు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించిందని మండిపడ్డారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యిందని తెలిపారు. తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారన్నారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేధింపులకు గురిచేసినందుకు నరేంద్ర కుటుంబానికి పరిహారం చెల్లించాలని చంద్రబాబు అన్నారు. 

Advertisement
Advertisement