Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవినేని శ్రీమన్నారాయణ మృతి బాధాకరం: Chandrababu

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ మృతి అత్యంత బాధాకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. దేవినేని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియాజేశారు. దేవినేని వెంకటరమణ దంపతుల పేరుమీద వృద్ధాశ్రమం నడుపుతూ ఎనలేని సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు. 


లోకేష్ సంతాపం....

దేవినేని శ్రీమన్నారాయణ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని... వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Advertisement
Advertisement