జగన్ హయాంలో స్వాతంత్రం ఎక్కడుంది: కళా

ABN , First Publish Date - 2020-08-15T20:59:53+05:30 IST

జగన్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం ఎక్కడుందని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదిరిస్తే హత్యలు చేస్తున్నారన్నారు

జగన్ హయాంలో స్వాతంత్రం ఎక్కడుంది: కళా

విజయవాడ: జగన్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం ఎక్కడుందని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదిరిస్తే హత్యలు చేస్తున్నారన్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో జగన్ మాటలు దయ్యాలు వేధాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. 90 శాతం హామీలు అమలు చేశామని డప్పులు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయారని విమర్శించారు.

Updated Date - 2020-08-15T20:59:53+05:30 IST