Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో గంజాయి రవాణా రోజురోజుకూ పెరుగుతోంది: chinarajappa

అమరావతి: రాష్ట్రం నుంచి గంజాయి రవాణా రోజురోజుకూ పెరుగుతోందని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ గంజాయి రవాణాపై గట్టిగా మాట్లాడితే మాజీ మంత్రి ఆనందుబాబుపై కేసు పెట్టే ప్రయత్నం చేసారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రానికైనా ఏపీ నుంచే గంజాయి వెళ్తోందన్నారు. కేంద్రం లోక్‌సభలో ఇచ్చిన సమాధానం చూస్తే రాష్ట్రం పరిస్థితి అర్ధం అవుతుందని తెలిపారు.  3 ఏళ్లలో ఏపీ నుంచి గంజాయి రవాణా 3 రెట్లు పెరిగిందని పార్లమెంట్‌లోనే చెప్పారన్నారు. గంజాయి రవాణాలో ఉన్న వైసీపీ నేతలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉదాసీనత చూస్తే వైసీపీ నేతలు గంజాయి రవాణాలో ఉన్నారని తెలుస్తోందని చినరాజప్ప ఆరోపించారు. 


Advertisement
Advertisement