Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూపాయి కూడా కట్టవద్దు: పట్టాభి

అమరావతి: జగన్ టోకరా స్కీమ్‌కు పేదలెవరూ రూపాయి కూడా కట్టవద్దని ప్రజలను టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి కోరారు. పేదల ఇళ్లపై ఉన్న అప్పులను ఈ ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో ఎలా తొలగిస్తుందన్నారు. ఇళ్లకు వచ్చి 10వేలు ఇవ్వాలని అడిగే వారిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇళ్ల రిజిస్ట్రేషన్లకి వినియోగించే నాన్ జుడీషియల్ పేపర్లపై సీఎం బొమ్మలు, పార్టీ రంగులు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. అసలు వాటికి ఉన్న విశ్వసనీయత ఏంటన్నారు. 


Advertisement
Advertisement