ఉద్యోగుల సంక్షేమాన్ని అటకెక్కించే కుట్ర: అశోక్‌ బాబు

ABN , First Publish Date - 2020-04-08T09:39:48+05:30 IST

‘‘రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అడ్డుపెట్టుకొని ఉద్యోగుల సంక్షేమాన్ని అటకెక్కించే కుట్రకు పాల్పడుతోంది.

ఉద్యోగుల సంక్షేమాన్ని అటకెక్కించే కుట్ర: అశోక్‌ బాబు

అవనిగడ్డ టౌన్‌, ఏప్రిల్‌ 7: ‘‘రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అడ్డుపెట్టుకొని ఉద్యోగుల సంక్షేమాన్ని అటకెక్కించే కుట్రకు పాల్పడుతోంది. తాజా పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయం కొంతమేర తగ్గిన మాట వాస్తవం. అయితే మార్చి నెలలో సహజంగా అధిక రెవెన్యూ ఉంటుంది.


ఇప్పుడే సగం జీతాలు మాత్రమే ఇస్తున్న ప్రభుత్వం ఏప్రిల్‌, మే నెలల్లో ఆయా నెలల జీతాలతో పాటు ఉద్యోగులకు బకాయిపడిన మొత్తాన్ని ఎలా ఇస్తుంది?’’ అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు ప్రశ్నించారు. మంగళవారం అవనిగడ్డకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయటంతో పాటు పెన్షనర్లకూ, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ పూర్తి చెల్లింపులు చేయాలని కోరారు.

Updated Date - 2020-04-08T09:39:48+05:30 IST