Abn logo
Oct 23 2021 @ 14:37PM

Tdp కార్యాలయంపై దాడి కేసు.. 10 మంది అరెస్ట్‌

అమరావతి: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా 10 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పానుగంటి చైతన్య, పల్లపు మహేష్ బాబు, పేరూరి అజయ్, శేషగిరి పవన్‌కుమార్, అడపాల గణపతి,  షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్, లంక అభినాయుడుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్‌ కోసం టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు.


TAGS: TDP ARREST

ఇవి కూడా చదవండిImage Caption