టీడీపీ నేత ఇంటిపై వైసీపీ వర్గం దాడి

ABN , First Publish Date - 2021-04-08T12:44:02+05:30 IST

టీడీపీ నేత ఇంటిపై వైసీపీ వర్గం దాడి

టీడీపీ నేత ఇంటిపై వైసీపీ వర్గం దాడి

తూర్పుగోదావరి: జిల్లాలోని కిర్లంపూడి మండలం కృష్ణవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నాయకుడి ఇంటిపై వైసీపీ వర్గం దాడికి పాల్పడింది. ఈ దాడిలో టీడీపీ నాయకుడి ఇల్లు, రెండు బైకులు ధ్వంసమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సొసైటీ కార్పొరేషన్ ఉద్యోగం నిర్వహిస్తున్న గోపిపై చట్టపరమైనచర్యలు తీసుకోవాలని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈరోజు జరిగే ఎన్నికల్లో గోరకపూడి గోపి గ్రామంలో లేకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని సూచించారు.

Updated Date - 2021-04-08T12:44:02+05:30 IST