తదుపరి నిరోధం 15100

ABN , First Publish Date - 2021-04-05T06:11:13+05:30 IST

నిఫ్టీ గత వారంలో మూడే ట్రేడింగ్‌ దినాలు పనిచేసినప్పటికీ మైనర్‌ అప్‌ట్రెండ్‌లో నడిచి వారం గరిష్ఠ స్థాయికి చేరువలో క్లోజయింది. ప్రధాన మద్దతు స్థాయి 14400 కన్నా పైన బౌన్స్‌బ్యాక్‌ అయి తక్షణ ముప్పు ని

తదుపరి నిరోధం 15100

నిఫ్టీ గత వారంలో మూడే ట్రేడింగ్‌ దినాలు పనిచేసినప్పటికీ మైనర్‌ అప్‌ట్రెండ్‌లో నడిచి వారం గరిష్ఠ స్థాయికి చేరువలో క్లోజయింది. ప్రధాన మద్దతు స్థాయి 14400 కన్నా పైన బౌన్స్‌బ్యాక్‌ అయి తక్షణ ముప్పు నివారించుకోవడమే కాకుండా అప్‌ట్రెండ్‌ ఆశలు సజీవంగా నిలిపింది. కాని ఇప్పటికీ నిరోధ స్థాయిల కన్నా చాలా దిగువనే ఉన్నందు వల్ల అప్‌ట్రెండ్‌ ధ్రువీకరించలేకపోయింది. గత రెండు నెలల్లోనూ సైడ్‌వేస్‌ ట్రెండ్‌లో ట్రేడవుతూ 15400-14400 మధ్యన కదలాడుతోంది. 100 డిఎంఏ కన్నా పైన గత వారం రికవరీ సాధించినా ఇంకా స్వల్పకాలిక 20, 50 డిఎంఏల వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. రాబోయే రెండు సెషన్లలో ఈ స్థాయిల్లో నిలదొక్కుకుంటే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ప్రవేశిస్తుంది. అలాగే స్వల్పకాలిక నిరోధ స్థాయి 15100 వద్ద నిలదొక్కుకోవడం కూడా తప్పనిసరి. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధ స్థాయి 15100 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఇదే గతంలో సాధించిన ప్రధాన టాప్‌, గరిష్ఠ స్థాయి. తదుపరి ప్రధాన నిరోధం 15400.

బేరిష్‌ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినా భద్రత కోసం ప్రధాన మద్దతు స్థాయి 14600 కన్నా పైన రికవరీ సాధించాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశిస్తుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 14000.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారంలో ఈ సూచి 540 పాయింట్లు లాభపడి 33850 వద్ద క్లోజయింది. తదుపరి నిరోధం 34400 పైన నిలదొక్కుకుంటే మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమిస్తుంది. ప్రధాన నిరోధం 35000. ప్రధాన మద్దతు స్థాయిలు 33400, 33000.

పాటర్న్‌: ఆర్‌ఎ్‌సఐ సూచీ 50 శాతం స్థాయిలో కదలాడుతూ ఉండడం పెద్ద మార్పు ఏర్పడబోతోందనేందుకు సంకేతం. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం 15100 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ను బ్రేక్‌ చేయాలి. ప్రధాన వీక్లీ చార్టుల్లో 14500 వద్ద ‘‘ట్రిపుల్‌ బాటమ్‌’’లు సాధించింది. ఇది ట్రెండ్‌లో సానుకూలతను సూచిస్తోంది.

టైమ్‌: ఈ సూచి ప్రకారం మంగళ, గురువారాల్లో తదుపరి రివర్సల్స్‌ ఉన్నాయి.


సోమవారం స్థాయిలు

నిరోధం : 14960, 15040 

మద్దతు : 14880, 14800

Updated Date - 2021-04-05T06:11:13+05:30 IST