Abn logo
Oct 18 2021 @ 13:36PM

ఐర్లాండ్‌లో తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ సంబరాలు

డబ్లిన్: ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు బతుకమ్మ సంబరాలు ఈ సంవత్సరము ఘనంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 30 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కరోనా కారణంగా ఉన్న కఠిన నిబంధనల దృష్ట్యా ఈ సారి ఎక్కువ మంది హాజరుకాలేకపోయారు. ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 250 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైంది. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకు తెలియచేయాలనే లక్ష్యంతో  Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ప్రతి ఆడపడుచులకు బహుమతి ప్రధానం చేశారు. వచ్చిన అతిధులకు ప్రసాదం, రుచికరమైన వంటలు వడ్డించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...