అమెరికాలో ‘వేటా’ బ‌తుక‌మ్మ సంబ‌రాలు

ABN , First Publish Date - 2021-10-14T03:23:24+05:30 IST

తెలంగాణ పూల పండుగ‌.. బ‌తుక‌మ్మ వేడుక‌లు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అమెరికాలోనూ మ‌న తెలుగు మ‌హిళ‌లు నిర్వ‌హించిన బ‌తుక‌మ్మ సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి.

అమెరికాలో ‘వేటా’ బ‌తుక‌మ్మ సంబ‌రాలు

తెలంగాణ పూల పండుగ‌.. బ‌తుక‌మ్మ వేడుక‌లు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అమెరికాలోనూ మ‌న తెలుగు మ‌హిళ‌లు నిర్వ‌హించిన బ‌తుక‌మ్మ సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి.  ‘ఉమ‌న్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్’ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ సంబ‌రాల‌కు అంచ‌నాల‌కు ప్రజలు హాజ‌ర‌య్యారు. ఈ నెల 10వ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించి ఈ కార్య‌క్ర‌మానికి గొప్ప స్పందన రావడం విశేషం. అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్ రామ‌న్ స్పోర్ట్స్ పార్క్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి సుమారు 200 మందికి పైగా హాజ‌రవుతార‌ని తొలుత అంచ‌నా వేశారు. అయితే, బ‌తుక‌మ్మ సంబ‌రాల్లో 600 మందికిపైగా తెలుగు వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొని సంబ‌రాల‌కు కొత్త అందం తీసుకువ‌చ్చారు.  


‘ఉమ‌న్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్’ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు ‘శ్రీమతి ఝాన్సీ రెడ్డి హ‌నుమాండ్ల‌’, ప్రెసిడెంట్ ఎల‌క్ట్ శైల‌జ క‌ల్లూరి, కార్యదర్శి అనురాధ ఆలిశెట్టి, సంయుక్త  కార్యదర్శి ప్ర‌శాంతి కూచిభొట్ల‌, మీడియా స‌మ‌న్వ‌య‌క‌ర్త సుగుణ రెడ్డి, క‌ల్చ‌ర‌ల్ చైర్ ర‌త్న‌మాల వంకా, ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త హైమ అనుమాండ్ల‌, కోశాధికారి విశ్వ‌, వైస్ ప్రెసిడెంట్ య‌శ‌శ్విని రెడ్డి, సంయుక్త కోశాధికారి జ్యోతి, క‌మ్యూనిటీ స‌ర్వీస్ చైర్, కాలిఫోర్నియా బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ ల‌క్ష్మి య‌న‌మండ‌ల‌, శాక్రిమెంటో ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త పూజ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డంలో ప్ర‌ముఖ పాత్ర పోషించారు.

Updated Date - 2021-10-14T03:23:24+05:30 IST