బీసీసీఐ అపెక్స్‌లో టీసీఏపై చర్చ!

ABN , First Publish Date - 2021-04-08T05:59:58+05:30 IST

బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఈనెల 16న జరగనుంది. మొత్తం 14 అంశాలపై ఈ భేటీలో చర్చించనుండగా అందులో తెలంగాణ క్రికెట్‌ సంఘం (టీసీఏ) గుర్తింపుపై కూడా బీసీసీఐ...

బీసీసీఐ అపెక్స్‌లో టీసీఏపై చర్చ!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఈనెల 16న జరగనుంది. మొత్తం 14 అంశాలపై ఈ భేటీలో చర్చించనుండగా అందులో తెలంగాణ క్రికెట్‌ సంఘం (టీసీఏ) గుర్తింపుపై కూడా బీసీసీఐ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 30 లోపు టీసీఏ గుర్తింపుపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ముంబై హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం, బీసీసీఐ కార్యదర్శిగా జైషా కావడంతో తమకు కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని టీసీఏ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ వర్గం ఆశాభావంతో ఉంది. 


Updated Date - 2021-04-08T05:59:58+05:30 IST