తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: హరీష్ రావు

ABN , First Publish Date - 2021-08-23T19:49:00+05:30 IST

తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలది అవగాహన రాహిత్యమని తప్పుబట్టారు.

తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలది అవగాహన రాహిత్యమని తప్పుబట్టారు. విపక్షాలు రాజకీయ లబ్ది కోసమే అబద్దాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే తాను మాట్లాడుతున్నానని, వృద్ధిరేటులో తెలంగాణ రెట్టింపు సాధించిందన్నారు. దేశంలో వృద్ధిరేటు 50 శాతం మాత్రమే ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో స్థిరంగా కొనసాగుతోందని, కరోనా కాలంలోనూ తెలంగాణ పాజిటివ్ వృద్ధిరేటు సాధించిందని హరీష్ రావు పేర్కొన్నారు.


‘‘క్లిష్ట సమయంలోనూ పాజిటివ్ వృద్ధి రేటు సాధించాం. గత ఆరేళ్లలో 11.7 వృద్ధి రేటు సాధించాం. దేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు పెరిగింది. బంగ్లాదేశ్ వృద్ధిరేటు కంటే మన దేశ వృద్ధిరేటు పడిపోయింది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు గమనించాలి. దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తలసరి ఆదాయం పెరుగుదలలో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. ప్రతి ఏడాది జీడీపీ రేటు పెరుగుతోంది. రైతు బీమా కింద 32.72 లక్షల మంది రైతులకు లబ్ది పొందారు’’ అని హరీష్ రావు వివరించారు.

Updated Date - 2021-08-23T19:49:00+05:30 IST