‘పటాన్‌చెరు’ ఉదంతం.. నష్ట నివారణ చర్యల దిశగా డీజీపీ

ABN , First Publish Date - 2020-02-28T10:57:27+05:30 IST

ఆత్మహత్యకు పాల్పడ్డ సంధ్యారాణి అనే విద్యార్థిని తండ్రిని ఓ కానిస్టేబుల్‌ బూటుకాలితో తన్నడం కలకలం రేపిన నేపథ్యంలో.. ...

‘పటాన్‌చెరు’ ఉదంతం.. నష్ట నివారణ చర్యల దిశగా డీజీపీ

  • ఒకేసారి వేయి కార్యాలయాలతో వీడియో కాన్ఫరెన్స్‌
  • మానవీయ కోణంలో పనిచేయాలని ఉద్బోధ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్యకు పాల్పడ్డ సంధ్యారాణి అనే విద్యార్థిని తండ్రిని ఓ కానిస్టేబుల్‌ బూటుకాలితో తన్నడం కలకలం రేపిన నేపథ్యంలో.. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నష్టనివారణ చర్యలను ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల దాకా.. ప్రతిఒక్కరూ హాజరయ్యేలా గురువారం రికార్డుస్థాయిలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్వీయ క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఉద్బోధించారు. మానవీయకోణంలో పనిచేయాలని సూచించారు. శాంతిభద్రతల పోలీసులే కాకుండా.. బెటాలియన్లు, ఇతర యూనిట్లు, శిక్షణ కళాశాలలు.. ఇలా అన్ని విభాగాలకు చెంది న సిబ్బంది, అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పటాన్‌చెరులో చోటుచేసుకున్న ఘటన వల్ల మొత్తం పోలీసు శాఖ అప్రతిష్టపాలయ్యే ప్రమా దం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక విలువలు, మానవీయం తదితర అంశాలపై సిబ్బందికి నిరంతరం పునశ్చరణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పటాన్‌చెరు తరహా ఘటన పునరావృతమవ్వకుండా హోంగార్డు మొదలు, ఉన్నతాధికారి దాకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసింగ్‌పై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలన్నారు.  

Updated Date - 2020-02-28T10:57:27+05:30 IST