Abn logo
Jul 18 2021 @ 19:46PM

తెలంగాణకు నష్టం చేసే ఏ అంశాన్ని వదిలి పెట్టం: ఎంపీ నామా

హైదరాబాద్: తెలంగాణకు నష్టం చేసే ఏ అంశాన్ని వదిలి పెట్టమని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రకటించారు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని కోరామని, ఒకే రోజున రెండు మూడు బిల్స్ ఆమోదం చేసుకోవడం కాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చలు జరపాలని కోరామని తెలిపారు. 48 గంటల ముందే బిల్లుల వివరాలు సభకు తెలపాలని, విభజన హామీలు, పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని కోరామని తెలిపారు. తక్కువ సమయంలో 29 బిల్లులు పార్లమెంటు ముందుకు తెస్తున్నారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా ప్రజా సమస్యలపై తమ వైఖరి పార్లమెంటు వేదికగా తెలుపుతామని నామా నాగేశ్వరరావు ప్రకటించారు.

క్రైమ్ మరిన్ని...