Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహేశ్‌బాబు‌ సినిమాలో కూడా నటించిన ఈ 16 ఏళ్ల NRI తెలుగమ్మాయి.. ఇప్పుడో సెన్సేషన్..!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో 16 ఏళ్ల తెలుగు అమ్మాయి సెన్సేషన్‌గా మారింది. సినీ అభిమానులంతా ఆ అమ్మాయి నటనకు ముగ్ధులవుతున్నారు. ఆమె నటనకు మెచ్చి.. శభాష్ అంటున్నారు. మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, నాగచైతన్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించిన ఈ 16ఏళ్ల ఎన్నారై తెలుగు అమ్మాయి ప్రస్తుతం సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలుస్తోంది. ఆమె నటించిన ఓ సినిమా తాజాగా విడుదలవడంతో మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అవంతిక వందనపు.. పదహారణాల తెలుగు అమ్మాయి. తల్లిదండ్రులు అగ్రరాజ్యానికి వలస వెళ్లడంతో.. 2005 జనవరి 1న కాలిఫోర్నియాలో (లాస్ ఏంజిల్స్) పుట్టి, అక్కడే పెరిగింది. నటనపై మక్కువతో సినీ రంగంవైపు అడుగులు వేసింది. ఇండియాకు చెందిన మంజరి మకిజానీ దర్శకత్వం వహించిన ‘స్పిన్’ మూవీలో ఇండియన్ అమెరికన్ టీనేజర్‌ (రియా కుమార్)గా అవంతిక నటించి మెప్పించింది. భారత సంతతికి చెందిన యువతి జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను దాటుకుని డీజేగా ఎలా సక్సెస్ అయిందని చూపించిన ఈ సినిమాలో.. అవంతిక నటనకు ప్రేక్షకులు నూటికి నూరు మార్కులూ వేస్తున్నారు. ఆగస్టు 13న డిస్నీ చానల్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘స్పిన్’ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ 16ఏళ్ల తెలుగు అమ్మాయి పేరు విశ్వవ్యాప్తంగా మారుమోగుతోంది. 


2015లో రెండు సినిమాల్లో నటించడానికి ఒప్పుకోవడం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అవంతిక అడుగుపెట్టింది. నాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ కథ చిత్రంలో అవంతికకు ఓ పాత్ర దక్కినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఈ తెలుగు అమ్మాయి ఆ సినిమాలో నుంచి తప్పుకుంది. అయితే మహేశ్ బాబు, కాజల్, సమంత, ప్రణీత నటించిన బ్రహ్మోత్సవం సినిమా ద్వారా బాటనటిగా 2016లో అవంతిక తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే సంవత్సరం మనమంతా సినిమాలో, నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాలో యంగ్ సింధు పాత్రల్లో నటించింది. 2017లో రారండోయ్ వేడుక చూద్దాం(జూనియర్ రకుల్ ప్రీత్), బాలకృష్ణుడు (యంగ్ ఆధ్య), ఆక్సిజన్ సినిమాల ద్వారా వెండితెరపై తళుక్కుమంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ అజ్ఞాతవాసి‌లో కూడా ఈ తెలుగు అమ్మాయి చిన్న పాత్ర పోషించింది. ప్రస్తుతం స్పిన్ సినిమాలో రియా కుమార్ క్యారెక్టర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన అవంతిక తమిళ మూవీ భూమికలో కూడా నటించింది. ప్రస్తుతం ‘సీనియర్ ఇయర్’ అనే ఆంగ్ల పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా.. అవంతిక వెండి తెరపై కనిపించడానికి ముందే.. డా. ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ప్రజా హక్కు అనే లఘు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అవంతిక బాలనటిగా అందరినీ మెప్పించింది. దీంతో బాలనటిగా ఆమె అవార్డును కూడా అందుకుంది. 

నాట్యంపై ఇష్టంతో ఐదవ ఏట నుంచే శిక్షణ పొంది.. కూచిపూడి నేర్చుకుంది. ఈ క్రమంలోనే 2012 సంవత్సరంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) స్టార్ డ్యాన్సర్ పురస్కారాన్ని అందుకుంది. ఆ తర్వాత 2014లో ఓ చానల్‌కు సంబంధించిన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్’ (ఉత్తర అమెరికా ఎడిషన్)‌ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ‘స్పిన్’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అవంతిక.. తాజాగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ నావెల్‌గా గుర్తింపు పొందిన నవల హక్కులను కొనుగోలు చేసినట్టు చెప్పింది. అంతేకాకుండా ఆ నవలను సినిమా రూపంలో తీసుకురానున్నట్టు వెల్లడించింది. అయితే ఆ నవలకు సంబంధించిన వివరాలను మాత్రం ఆమె బయటపెట్టలేదు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement