Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండలు

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలలో ఏండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది.  కనిష్టం 35 నుండి గరిష్ఠం 42 డీగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే ఒకటి రెండు డీగ్రీలు, కొన్ని చోట్ల మూడు నాలుగు డీగ్రీలు ఎక్కువుగా నమోదయ్యే  ఆవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఆవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఉదయం 9గంటలకే ఎండతీవ్రత మొదలై సాయంత్రమైనా చల్లారని పరిస్థితి నెలకొంది. మార్చి ప్రారంభం నుండి ఉష్ణోగ్రత్తలు పెరగడంతో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. ఒక వైపు ఎండలతో ఇబ్బందిపడుతుంటే మరో వైపు కరోనా కోరలు చాస్తుంది. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, స్వీయ నియంత్రణ లేకుండా బయట తిరగడం వల్ల కరోనా వచ్చే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement