Abn logo
Jan 8 2021 @ 23:25PM

ఆలయ నిర్మాణంలో వివాదం

 యువకుడి ఆత్మహత్యాయత్నం

తిరుమలాయపాలెం, జనవరి 8: తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బంగారు మైసమ్మ గుడి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. తన ఇంటిముందు గుడిని నిర్మిం చొద్దని ఓ యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పా ల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సుమారు 25ఏళ్ల క్రితం బంగారుమైసమ్మ ఆలయం నిర్మించారు. ఆలయ మరమ్మతుల కోసం ఆర్థికసాయం అం దించాలని దళితులు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డిని కోరగా.. ఇటీవల ఆలయం కోసం రూ.50వేలు అందించారు. దీంతో కాలనీవాసులు మట్టె దుర్గాప్రసాద్‌ ఇంటిముందు నూ తనంగా ఆలయం నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో గుడినిర్మాణం ఆ పేందుకు దుర్గాప్రసాద్‌ తన ఇంటిముందు అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుచేశారు. శుక్రవారం ఉదయం ఆయన వ్యతిరేక వర్గీయులు అంబేద్కర్‌ విగ్రహాన్ని పక్కకు తొ లగించారు. దీంతో దుర్గాప్రసాద్‌ బంగారుమైసమ్మ గుడి నిర్మిస్తే తనకు నష్టం జరుగుతుందని, అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతణ్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. 108లో ఖమ్మంతరలించారు. కాగా ఎస్‌ఐ రఘు ఇరువర్గాలతో మాట్లాడారు. అందరికి ఆమోదకరంగా ఉండే స్థలంలో ఆలయం నిర్మించుకోవాలని, గొడవలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Advertisement
Advertisement