తహసీల్‌ ఆఫీసుల్లో ‘కంప్యూటర్ల’కు టెండర్లు

ABN , First Publish Date - 2021-06-11T10:09:17+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 590 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండడంతో అవసరమైన కంప్యూటర్‌ పరికరాలు అందించడంతో

తహసీల్‌ ఆఫీసుల్లో ‘కంప్యూటర్ల’కు టెండర్లు

రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 590 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండడంతో అవసరమైన కంప్యూటర్‌ పరికరాలు అందించడంతో పాటు వాటి నిర్వహణకు టెండర్లు పిలిచారు. 2018లో ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయాలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, సీసీ కెమెరాలు, ఫింగర్‌ ప్రింట్‌ పరికరాలు సమకూర్చింది. 2020 నవంబరు 2 నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దాంతో అత్యాధునిక పరికరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 15 సాయంత్రం 4 గంటలవరకు గడువు విధించారు. అదేరోజు టెండర్లు తెరుస్తారు. టెండర్లు పొందే సంస్థ ప్రతి జిల్లాలో ఇద్దరు మెయింటెనెన్స్‌ ఇంజనీర్లను సమకూర్చాలి. ఏ సాంకేతిక సమస్య ఎదురైనా ఏకకాలంలో పరిష్కరించి, నివేదికలు సమర్పించాలి. 

Updated Date - 2021-06-11T10:09:17+05:30 IST