తిరుపతిలో టెన్షన్.. టెన్షన్

ABN , First Publish Date - 2020-09-23T21:33:04+05:30 IST

తిరుపతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. సీఎం జగన్ తిరుమల పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్ నేరుగా

తిరుపతిలో టెన్షన్.. టెన్షన్

తిరుపతి: తిరుపతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. సీఎం జగన్ తిరుమల పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్ నేరుగా ఢిల్లీ నుంచి రేణిగుంటకు వస్తారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్తారు. దీంతో రేణిగుంట ఎయిర్‌పోర్టులో మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ తిరుపతి పర్యటనలో సందర్భంగా మీడియాకు ఆంక్షలు విధించినట్లు చెబుతున్నారు. మీడియా ప్రతినిధులను ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  


సీఎం తిరుమల పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా నేతల ముందస్తు హౌస్ అరెస్టులు చేశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీడీపీ, బీజేపీ పట్టుపడుతున్నారు. టీడీపీ, బీజేపీ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, పుంగనూరులో శ్రీనాథ్‌రెడ్డి, అనూష రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సాంప్రదాయబద్ధంగా కుటుంబంతో కలసి వచ్చి సమర్పించాలని ముఖ్యమంత్రిని టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అలా కాకుండా ఒక్కరే తిరుమల వచ్చిన పక్షంలో హిందూ మత విశ్వాసాల పట్ల, శ్రీవారి పట్ల గౌరవం కలిగివున్నానంటూ డిక్లరేషన్‌ ఇచ్చాకే ఆలయంలో అడు గుపెట్టాలని ఆయన స్పష్టం చేశారు.


Updated Date - 2020-09-23T21:33:04+05:30 IST