నెంబర్ వన్‌గా టెస్లా.. టోయోటాను వెనక్కి నెట్టి మరీ..

ABN , First Publish Date - 2020-07-03T00:12:53+05:30 IST

ఎలాన్ మస్క్. ప్రపంచంలో ఈ పేరు ప్రస్తుతం ఓ సంచలనం. నాసాతో కలిసి అంతరిక్షంలోకి మానవసహిత...

నెంబర్ వన్‌గా టెస్లా.. టోయోటాను వెనక్కి నెట్టి మరీ..

న్యూయార్క్: ఎలాన్ మస్క్. ప్రపంచంలో ఈ పేరు ప్రస్తుతం ఓ సంచలనం. నాసాతో కలిసి అంతరిక్షంలోకి మానవసహిత రాకెట్ పంపిన ఏకైక ప్రైవైటు సంస్థగా మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ నిలిచింది. ఈ నేపథ్యంలో అతడి మిగతా కంపెనీలు కూడా మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా మస్క్‌ ప్రధాన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ప్రపంచంలోనే నెంబర్ వన్‌ స్థానానికి చేరుకుంది. కంపెనీ విలువ కూడా ప్రస్తుతం 208 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పటివరకు 203 బిలియన్ డాలర్లతో టోయోటా కార్ల తయారీ సంస్థ ముందున్నప్పటికీ దానిని వెనక్కు నెట్టి మరీ టెస్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దీనిపై మస్క్ తన ఉద్యోగులకు ఓ ఈమెయిల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ‘కంపెనీ గడ్డుకాలంలో ఉన్నప్పటికీ మీరు పనిచేసిన తీరు అద్భుతం.


మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. మీతో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అంటూ ఆ మెయిల్‌లో రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే టెస్లా ప్రారంభం నుంచి ఏ ఒక్క ఏడాదిలో కూడా భారీ లాభాలు గడించింది లేదు. ఇలాంటి సందర్భంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి సంస్థ చేరడం గమనార్హం.

Updated Date - 2020-07-03T00:12:53+05:30 IST