లొకేషన్లే ఆకర్షణ

ABN , First Publish Date - 2020-12-20T05:30:00+05:30 IST

ఒకప్పుడు విదేశాల్లో సినిమాల చిత్రీకరణ అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడావసరం లేకుండా- సినిమా యూనిట్లకు షూటింగ్‌కు అవసరమైన సౌకర్యాలు కల్పించే సంస్థలు అందుబాటులోకి వచ్చేశాయి...

లొకేషన్లే ఆకర్షణ

ఒకప్పుడు విదేశాల్లో సినిమాల చిత్రీకరణ అంటే  చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడావసరం లేకుండా- సినిమా యూనిట్లకు షూటింగ్‌కు అవసరమైన సౌకర్యాలు కల్పించే సంస్థలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇథియోపియా నుంచి ఇటలీ వరకూ ఏ దేశంలోనైనా షూటింగ్‌ చేసుకోగలిగిన సౌలభ్యం ఇప్పుడు ఉంది. 


ఇవీ ప్రత్యేకతలు...

ఐస్‌లాండ్‌, జపాన్‌, బల్గేరియాలో ఫిల్మ్‌ మేకింగ్‌ చాలా స్ట్రాంగ్‌. ప్రొపెషనల్‌ క్రూ ఉండటం ఆ దేశాలకు ప్లస్‌ పాయింట్‌. పెద్దపెద్ద స్టూడియోలు, యాక్షన్‌ సెట్స్‌ ఇక్కడ ఎక్కువ. తమిళ దర్శకుడు శంకర్‌ చిత్రీకరణలు ఎక్కువగా అక్కడ జరుగుతుంటాయి. ‘దిల్‌ వాలే’లో ‘గేరువా’ పాట, ‘నాయక్‌’లో మరో పాటను ఐస్‌లాండ్‌లోనే చిత్రీకరించారు. ‘అజ్ఞాతవాసి’లో బాంబ్‌ బ్లాస్ట్‌లు, కార్‌ ఛేజ్‌లు, ‘గరుడవేగ’లో డ్యామ్‌ సీన్‌, ఛేజ్‌ సీన్‌లు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కీలక ఘట్టాలు బల్గేరియాలో చిత్రీకరించినవే. దర్శకుడు క్రిష్‌ ‘కంచె’ చిత్రాన్ని ఎక్కువ శాతం జార్జియాలోనే చిత్రీకరించారు. పురాతన కోటలకు ప్రసిద్ధి చెందిన మొరాకోలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. చిరంజీవి నటించిన ‘ఖైదీ నం.150’ క్రోవేషియా, స్లోవేనియా, యూర్‌పలో చిత్రీకరించారు. అజర్‌బైజాన్‌లోని బాకు ప్రాంతంలో ‘వినయవిధేయరామా’ చిత్రంలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ‘సాహో’ చిత్రాన్ని ఎక్కువశాతం అబుదాబిలో చిత్రీకరించారు. లాక్‌డౌన్‌ తర్వాత విదేశాల్లో చిత్రీకరణలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. తాజాగా ‘రాధేశ్యామ్‌’, ‘రంగ్‌ దే’ చిత్రాలు ఇటలీలో భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకొచ్చాయి. 


చూసిన లోకేషన్‌లో సీనును చూడాలంటే ప్రేక్షకులకు బోరు కొడుతుంది. అందుకే దర్శకులు కొత్త కొత్త లోకేషన్ల కోసం వెతుకుతూ ఉంటారు. ఒకప్పుడు పాటలకు మాత్రమే విదేశీ లొకేషన్లు పరిమితమయ్యేవి. ఇప్పుడు సినిమా మొత్తం విదేశాల్లోనే తీస్తున్నారు. ‘ఫిదా’, ‘నిన్ను కోరి’, ‘లై’, ‘నిశబ్దం’ లాంటి సినిమాలలో ఎక్కువ భాగం షూటింగ్‌ విదేశాల్లోనే జరిగింది. అయితే ప్రతి దర్శకుడికి తనదైన ఊహలు ఉంటాయి వాటికి తగిన లోకేషన్లు కావాలనుకుంటాడు. ఒకప్పుడు సినిమా ప్రొడక్షన్‌కు సంబంధించిన వారే లోకేషన్ల ఎంపిక, అనుమతులు చూసుకొనేవారు. ఇప్పుడా అవసరం లేకుండా ఈ ఏర్పాట్లు చేయటానికి ప్రత్యేకంగా ఏజంట్లు ఉన్నారు. వీరికి సినిమా అవసరాలు చెబితే- వారు తగిన లోకేషన్లు చూపించటం మాత్రమే కాకుండా - అవసరమైన అనుమతులను కూడా తీసుకు వస్తారు. 




మొదటి తెలుగు సినిమా

ఒకప్పుడు బొలివియాలో షూటింగ్‌లు జరగటం తక్కువ. ఈ దేశంలో అల్లూ అర్జున్‌ నటించిన సరైనోడులో ‘తెలుసా.. తెలుసా’ అనే  పాటను చిత్రీకరించారు.  ఈ ఒక్క పాటకు 2.5 కోట్ల వరకూ ఖర్చు అయిందని ఒక అంచనా.  ఈ పాటకు విశేష ప్రేక్షకాదరణ లభించింది. దీనితో కేవలం తెలుగు సినిమాలే కాకుండా పరభాష చిత్రాల షూటింగ్‌లు కూడా ఇక్కడ జరగటం మొదలు పెట్టాయి.




అనుమతులు ఇలా.

ఇప్పుడు ప్రతి దేశంలోనూ సినిమా పరిశ్రమ కోసం ప్రత్యేకమైన ఫిల్మ్‌ కమిషన్లు ఏర్పాటయ్యాయి. వాటికి అనుబంధంగా కొన్ని ప్రొడక్షన్‌ కంపెనీలు ఉంటాయి. విదేశీ సినిమా యూనిట్లకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చటం ఈ ప్రొడక్షన్‌ కంపెనీల బాధ్యత. స్టార్స్‌కు అవసరమైన కేరవాన్‌లు, షూటింగ్‌లో అవసరమైన ట్రాలీ, క్రేన్స్‌, లైటింగ్‌ ఎక్వి్‌పమెంట్‌,  ఫైటర్స్‌, డాన్సర్‌, సెట్‌ బాయ్స్‌, కార్పెంటర్స్‌ అందరూ వీరి దగ్గర అందుబాటులో ఉంటారు. సినిమాలో నటీనటులకు అవసరమైన కాస్ట్యూమ్స్‌, కొన్ని ప్రత్యేకమైన కెమెరా ఎక్వ్యూ్‌పమెంట్‌ మినహాయిస్తే- మిగిలినవన్నీ అందుబాటులోనే ఉంటాయి. కొందరు ఏజెంట్లు ఈ ప్రొడక్షన్‌ కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. అందువల్ల అవసరమైన పర్మిషన్‌లన్నీ సులభంగానే లభిస్తాయి. 


రాయితీ ప్రధాన ఆకర్షణ

యూర్‌పలో 29 దేశాలున్నాయి. వీటిలో పశ్చిమ యూరప్‌ దేశాలైన జర్మనీ, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌లలో జీవన ప్రమాణాలు ఎక్కువ. దీని వల్ల షూటింగ్‌కు అయ్యే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు అక్కడ షూటింగ్‌లో- ఒక సెట్‌ బాయ్‌కు గంటకు 25 నుంచి 30 యూరోలు (రూ. 2500 నుంచి రూ. 3000) చెల్లించాల్సి ఉంటుంది. అయితే యూర్‌పలోని దేశాలన్నీ ఎక్కువ షూటింగ్‌ యూనిట్‌లను ఆకర్షించటం కోసం రాయితీలను ఇస్తున్నాయి. ఈ రాయితీల వల్ల షూటింగ్‌కు అయ్యే బడ్జెట్‌ గణనీయంగానే తగ్గుతోంది.  ఉదాహరణకు యూర్‌పలోని ఒక లోకేషన్‌లో ఛేజింగ్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేయాలంటే 15 నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇక పాటల విషయంలో అయ్యే ఖర్చు స్టార్లను బట్టి ఉంటుంది. 




‘‘సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకూ ఈ ప్రయాణంలో స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ పని చాలా కీలకం. సెట్‌లో పని జరుగుతున్నంత సేపు ఏదో ఒక యాంగిల్‌లో హీరోహీరోయిన్లు, ఇతర ఆర్టి్‌స్టల ఫొటోలు తీయాల్సి ఉంటుంది. ఆ ఫొటోలు పోస్టర్‌గా దర్శనమిస్తాయి. విదేశాల్లోని కొత్త లొకేషన్‌లకు వెళ్లినప్పుడు అక్కడి అందాలను క్లిక్‌మనిపించడంలో పదిమంది చూసే ప్రయత్నం చేసే పనిలో ఉండే కిక్‌ మరే పనిలోనూ ఉండదు. అదంతా నిర్మాత ఇచ్చిన అవకాశం వల్లనే సాధ్యం అవుతుంది. ఒక కన్ను తీసిన ఫొటోను కోట్లమంది చూస్తారు. అంతకుమించిన ఆనందం ఇంకేం ఉంటుంది. అయితే స్టిల్‌ ఫొటోగ్రాఫర్స్‌కి పోస్టర్‌ మీద క్రెడిట్స్‌ లేకపోవడం అనేది కాస్త బాధగా ఉంటుంది. 

- రఘునాథ్‌ జూపల్లి

 స్టిల్‌ ఫొటోగ్రాఫర్





‘‘ఓ కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి ఆహ్లాదకరమైన లొకేషన్లు కనిపిస్తే తప్పకుండా కెమెరాకు పని చెప్పాలనిపిస్తుంది. అదే ఆలోచన ఫిల్మ్‌ మేకర్స్‌కూ వస్తుంది. ఆ ఆలోచనలకు దృశ్యరూపమే మన సినిమాల్లో కనిపించే అద్భుతమైన లొకేషన్లు. విదేశాల్లో షూటింగ్‌ అయితే  స్టిల్‌ ఫొటోగ్రాఫర్స్‌కి ఆనందమే. కొత్తకొత్త ప్రదేశాలను నలుగురికి చూపించే అవకాశం ఉంటుంది. ఆ లొకేషన్‌కి తగ్గట్టుగా రకరకాల ఫొటోలు తీసే అవకాశం ఉంటుంది’’

- జీవన్‌రెడ్డి

స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌


Updated Date - 2020-12-20T05:30:00+05:30 IST