హెల్త్‌కార్డులపై సీఎం జోక్యం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-09-20T09:11:49+05:30 IST

ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం కార్డులను కార్పొరేట్‌ ఆస్పత్రులు నిరాకరిస్తుండటంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అప్పులపాలవుతున్నారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

హెల్త్‌కార్డులపై సీఎం జోక్యం చేసుకోవాలి

కార్పొరేట్‌ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి : బొప్పరాజు


అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం కార్డులను కార్పొరేట్‌ ఆస్పత్రులు నిరాకరిస్తుండటంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అప్పులపాలవుతున్నారని  ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం కల్పించాలని ఒక ప్రకటనలో ఆయన కోరారు.  రాష్ట్రంలో ఉద్యోగుల వైద్యానికి సంబంధించి రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిలిపివేయడం వల్ల డబ్బులు చెల్లించినా.. కొవిడ్‌, ఇతర వ్యాధులకు సరైన వైద్యం అందక, ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి  రాక ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతినెలా చందా చెల్లిస్తూ కూడా వైద్య సహాయం అందక అప్పులపాలవడం, మరికొందరు సరైన వైద్యం అందక మరణించడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా హెల్త్‌కార్డు ద్వారా కొవిడ్‌, ఇతర వైద్య సదుపాయాలు తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-09-20T09:11:49+05:30 IST