సకారియా ఇంట మరో విషాదం

ABN , First Publish Date - 2021-05-10T09:22:52+05:30 IST

రాజస్థాన్‌ రాయల్స్‌ యువ పేసర్‌ చేతన్‌ సకారియా ఇంట మరో విషాదం నెలకొంది. గతంలో అతడి సోదరుడు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా తండ్రి

సకారియా ఇంట మరో విషాదం

కొవిడ్‌తో క్రికెటర్‌ తండ్రి మృతి


భావ్‌నగర్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ యువ పేసర్‌ చేతన్‌ సకారియా ఇంట మరో విషాదం నెలకొంది. గతంలో అతడి సోదరుడు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా తండ్రి కన్జిభాయ్‌ సకారియా కరోనాతో మరణించాడు. కొద్ది రోజులుగా అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని రాజస్థాన్‌ ఫ్రాంచైజీ ట్విటర్‌లో ప్రకటించింది. ఈ కష్టకాలంలో అతడికి అండగా ఉంటామని పేర్కొంది. తన ఐపీఎల్‌ డబ్బులతోనే తండ్రికి మెరుగైన చికిత్స అందించగలుగుతున్నానంటూ ఇటీవలే సకారియా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది జనవరిలో అతడి సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


Updated Date - 2021-05-10T09:22:52+05:30 IST