డీల్‌పై సీబీఐ విచారణ జరపాలి

ABN , First Publish Date - 2021-03-02T08:40:22+05:30 IST

రాయలసీమలోని ఓ ఆశ్రమంలో రూ.400 కోట్ల అక్రమ లావాదేవీల వ్యవహారంలో బీజేపీ నాయకులు రూ.30 కోట్ల మేరకుఒప్పందం కుదుర్చుకున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన

డీల్‌పై సీబీఐ విచారణ జరపాలి

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలి: సీపీఎం


అనంతపురం టౌన్‌, మార్చి 1: రాయలసీమలోని ఓ ఆశ్రమంలో రూ.400 కోట్ల అక్రమ లావాదేవీల వ్యవహారంలో బీజేపీ నాయకులు రూ.30 కోట్ల మేరకుఒప్పందం కుదుర్చుకున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’లో  వచ్చిన కథనంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని సీపీఎం అనంతపురం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ కోరారు. సోమవారం సాయంత్రం అనంతపురంలో ఆయన మాట్లాడారు. అవినీతి, అక్రమాల గురించి నిత్యం మాట్లాడే బీజేపీ నాయకులు ఈ డీల్‌పై తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమంగా భూములు ఆక్రమించడం, భూతగాదాలు, పంచాయతీలు చేయడంపై బీజేపీ నాయకులపై అనేక విమర్శలొచ్చాయని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలో ఉన్న కొన్ని ఆశ్రమాలకు బీజేపీ జాతీయ నాయకులు సైతం తరచూ వస్తున్నారని, ఈ పర్యటనల వెనుక వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ చేత నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు.

Updated Date - 2021-03-02T08:40:22+05:30 IST