అన్నలు కాదు.. కామాంధులు!

ABN , First Publish Date - 2021-04-07T09:06:12+05:30 IST

అతడికి ఆమె తోడబుట్టిన..

అన్నలు కాదు.. కామాంధులు!

సోదరిపై అన్న, పెద్దమ్మ కొడుకు అత్యాచారం

చెప్పినా పట్టించుకోని కన్నతల్లి, పెద్దమ్మ, ఆమె భర్త 


కొత్తగూడెం: అతడికి ఆమె తోడబుట్టిన సోదరి! పెళ్లీడుకొచ్చిన ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టాల్సిన బాధ్యత ఉన్న ఆ అన్నే ఆమెపై కన్నేశాడు. శారీరకంగా లోబర్చుకున్నాడు. కొన్నాళ్ల నుంచైతే చిత్రహింసలు పెట్టి నరకం చూపిస్తున్నాడు. రక్షణ కోసం పెదమ్మ ఇంటికి వెళితే అక్కడా ఆమెకు అదే నరకం. వరుసకు సోదరుడయ్యే పెద్దమ్మ కుమారుడూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ దారుణం వెలుగుచూసింది. మణుగూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ విభాగంలో పని చేస్తున్నాడు. చిన్నప్పుడే నాన్న వదిలివెళ్లడంతో అమ్మ, చెల్లెలి (20)తో కలిసి ఉంటున్నాడు. చెల్లిపై కన్నేసి ఆమెను లోబర్చుకొని.. శారీరకంగా హింసిస్తున్నాడు.


అన్న అఘాయిత్యాల గురించి తల్లికి చెప్పినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు, తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడా ఆమె కొడుకు నరకం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు.. కన్నతల్లికి, పెద్దమ్మ కుటుంబసభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక స్నేహితులు, గతంలో తనకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. విషయాన్ని బయటపెడితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని బాధితురాలు వాపోతోంది. ఘటనపై బాధితురాలి సోదరుడు, ఆమెతల్లి, పెద్దమ్మ, ఆమె భర్త, కుమారుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-07T09:06:12+05:30 IST