బుల్లి రాకెట్‌ రెడీ!

ABN , First Publish Date - 2022-03-15T09:23:07+05:30 IST

చిన్న చిన్న ఉపగ్రహాలను కారుచౌకగా కక్ష్యల్లోకి చేరవేసేందుకు ఇస్రో రూపొందిస్తున్న బుల్లి రాకెట్‌ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-ఎ్‌సఎ్‌సఎల్వీ) అందుబాటులోకి

బుల్లి రాకెట్‌ రెడీ!

ఎస్‌ఎస్‌ఎల్వీకి చివరి పరీక్ష విజయవంతం


శ్రీహరికోట (సూళ్లూరుపేట), మార్చి 14: చిన్న చిన్న ఉపగ్రహాలను కారుచౌకగా కక్ష్యల్లోకి చేరవేసేందుకు ఇస్రో రూపొందిస్తున్న బుల్లి రాకెట్‌ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-ఎ్‌సఎ్‌సఎల్వీ) అందుబాటులోకి వచ్చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలో (షార్‌) సోమవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఎస్‌ఎ్‌సఎల్వీకి నిర్వహించిన చివరిదైన భూస్థిర పరీక్ష సైతం విజయవంతమైంది. దీంతో అంతరిక్ష ప్రయోగాలకు ఈ రాకెట్‌ అందుబాటులోకి వచ్చినట్టయింది. ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఎ్‌సఎల్వీ-ఎ్‌సఎస్‌1 మోటారు పరీక్ష జరిగింది. షార్‌ డైరెక్టర్‌ రాజరాజ ఆర్ముగం, త్రివేండ్రంలోని వీఎ్‌సఎ్‌ససీ డైరెక్టర్‌ డి. ఉన్నికృష్ణనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. చివరి దశ పరీక్ష కూడా సక్సెస్‌ కావడంతో ఈ రాకెట్లను అందుబాటులోకి తీసుకొచ్చి.. ఏడాదికి 6 నుంచి 8 ప్రయోగాలు చేయాలని ఇస్రో భావిస్తోంది. ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌ మూడు ఘన ఇంధన మోటార్లతో (ఎస్‌ఎస్‌1, ఎస్‌ఎస్‌2, ఎస్‌ఎస్‌3) పయనించనుంది.   జూన్‌ లేదా జులైలో తొలి ఎస్‌ఎ్‌సఎల్వీ-డి1 ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది.  విదేశీ ఉపగ్రహాలను కారుచౌకగా ప్రయోగించేందుకు ఇస్రోకు ఈ రాకెట్‌ ఉపయోగపడనుంది.


Updated Date - 2022-03-15T09:23:07+05:30 IST