కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం : సీఐటీయూ

ABN , First Publish Date - 2020-05-31T09:35:44+05:30 IST

కార్మికుల హక్కుల సాధన కోసమే సీఐటీయూ ఆవిర్భవించబడిందని ఆసంఘం

కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం : సీఐటీయూ

ఘట్‌కేసర్‌/మేడ్చల్‌రూరల్‌/ ఘట్‌కేసర్‌రూరల్‌ :  కార్మికుల హక్కుల సాధన కోసమే సీఐటీయూ ఆవిర్భవించబడిందని ఆసంఘం జిల్లా కోశాధికారి సబిత అన్నారు. శనివారం సీఐటీయూ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఘట్‌కేసర్‌తో పాటు పలుచోట్ల ఎర్రజెండాలను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడారు.  కార్యక్రమంలో నర్సింహ, చంద్రమౌళి, చంద్రమోహన్‌, పెంటయ్య, పోచయ్య, ముత్యాలు, అలివేలు, ఎల్లమ్మ, శారద, మంజుల పాల్గొన్నారు.  మేడ్చల్‌లో సీఐటీయూ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా శనివారం వివిధ పరిశ్రమల్లో జెండాను ఆవిష్కరించారు. వలస కార్మికులకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.


మండలంలోని సంఘం హెల్త్‌కేర్‌, శ్రీరామ స్పిన్నింగ్‌ మిల్‌, మెడిసిటీ హాస్పిటల్‌, లైన్‌ స్టైల్‌ ఆల్‌ ఎల్‌వీ తదితర పరిశ్రమల్లో జెండాపే ఎగురవేశారు. కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అశోక్‌, నాయకులు భాస్కర్‌, నర్సింగ్‌రావు, బిక్షపతి, రమేష్‌, దేవేందర్‌, బాలయ్య, ప్రభాకర్‌, లక్ష్మణ్‌, సుధాకర్‌, జగన్‌ తదితరులు పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మండలం ఘణాపూర్‌, కాచవానిసింగారం తదితర గ్రామాల్లో జరిగిన వేడుకల్లో నార్కెట్‌పల్లి సబిత, రాజేశ్వర్‌, మంగారెడ్డి, అశోక్‌, నర్సింహ, చంద్రమౌళి, సునీత, ఎల్లమ్మ, మంజుల, జగదీష్‌, ముత్తమ్మ, దేవయ్య, కృష్ణ పాల్గొన్నారు. 


కార్మిక సమస్యల పరిష్కారమే లక్ష్యం

కార్మికుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బీస సాయిబాబా అన్నారు. సీఐటీయూ 50ఏళ్ల ఆవిర్భావ దినోత్సవాన్ని తిమ్మాపూర్‌లోని ఐవోసీఎల్‌ పరిశ్రమ ఆవరణలో శనివారం  నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం సాయిబాబా మాట్లాడారు. ఇంకా యాదయ్య, లింగం, గోపాల్‌, బాబు, రవి, శ్రీను పాల్గొన్నారు. యాచారంలో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి బ్రహ్మయ్య, మైసమ్మ, లలిత, రవీందర్‌, బద్రి, పాండరి, చంద్రయ్య, కృష్ణయ్య, వినోద, యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-05-31T09:35:44+05:30 IST